![]() |
![]() |

'మొగుడ్స్ పెళ్లామ్స్' లేటెస్ట్ ఎపిసోడ్ ఆడియన్స్ కి చక్కని వినోదాన్ని అందిస్తోంది. ఈ ఎపిసోడ్ లో అవినాష్ యముడిగా ఒక స్కిట్ చేశాడు. పక్కనే చిత్రగుప్తుడి వేషంలో ఎక్స్ప్రెస్ హరి కూర్చున్నాడు. "చిత్రగుప్తా! అసలు నీకా పేరు ఎందుకు వచ్చింది?" అడిగాడు అవినాష్. "చిన్నప్పటినుంచి చిత్రగారి పాటలు వింటూ పెరిగానని ఆ పేరు వచ్చింది" అంటూ కామెడీ చేశాడు హరి. "ఈ పంచ్ డైలాగ్ కి పంచె పట్టుకుని వెళ్ళిపోతాను" అంటూ నవ్వుతూ లేచెళ్లిపోయాడు అవినాష్.
"ఇంతకూ మీకు యమధర్మరాజు అని పేరెలా వచ్చింది?" అనడిగాడు చిత్రగుప్తుడు. "ధర్మవరంలో పుట్టాను కదా అందుకే ఆ పేరు వచ్చింది" అంటూ కామెడీ చేశాడు అవినాష్. తర్వాత చిత్రగుప్తుడు పాపులను పిలవడం స్టార్ట్ చేశాడు. అప్పారావు, సుబ్బలక్ష్మిని పిలిచాడు. "ఈవెంట్లలో తప్ప ఇంట్లో ఉండడు అప్పారావు" అని అతని మీద ఉన్న అభియోగాన్ని చెప్పాడు చిత్రగుప్తుడు.
"ఫేమ్ వచ్చిందని ఫ్యామిలీని వదిలేస్తావా?" అంటూ ఒక ప్రాస డైలాగ్ చెప్పాడు అవినాష్. "అప్పారావు ఒంటి చుట్టూ బెలూన్లు కట్టి గదతో పగలగొట్టించండి" అంటూ ఆజ్ఞాపించాడు. సుబ్బలక్ష్మి బోన్ లో నిలబడి అప్పారావు మీద కంప్లైంట్స్ చెప్పింది. "ఇంట్లో తక్కువ ఉంటాడు, ఇన్నోవాలో ఎక్కువ ఉంటాడు. నా పుట్టినరోజు తెలీదు కానీ వాట్సాప్ లో అమ్మాయిలకు బర్త్డే విషెస్ చెప్తాడు" అంది. వెంటనే అవినాష్ "జీవితంలో డబ్బే కాదు కుటుంబమూ ముఖ్యం" అన్నాడు. వెంటనే సుబ్బలక్ష్మి చేతికి కర్ర ఇచ్చి బెలూన్స్ పగలగొట్టమన్నాడు. సుబ్బలక్ష్మి బెలూన్స్ ని పగలగొట్టింది.
"శిక్ష ఐపోయింది కదా రూమ్ ఇస్తే రిలాక్స్ అవుతాం" అని అవినాష్ కి పంచ్ డైలాగ్ వేశాడు అప్పారావు. "ఇక ఈవెంట్స్ లో కాకుండా ఇంట్లో ఉండండి" అని సలహా ఇచ్చాడు అవినాష్. "ఇంట్లో కూడా ఉండనండి. ఎందుకంటే బిగ్ బాస్ కి వెళ్తున్నా" అని చెప్పాడు అప్పారావు. "ఒక్కడే వెళ్లడండి.. వెంట నేను కూడా వెళ్తున్నా" అంది సుబ్బలక్ష్మి. "ఇద్దరూ కలిసి వెళ్ళండి" అని షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించాడు యమధర్మరాజు అలియాస్ ముక్కు అవినాష్.
![]() |
![]() |